వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని ఖండాల దాబాలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో ఓ భర్త భార్యను కడతేర్చాడు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తికి చెందిన ధారావత్ సరిత, శేఖర్ దంపతులు ఉపాధి నిమిత్తం మడికొండలో నివాసముంటున్నారు.
అనుమానంతో భార్యను గొంతునులిమి చంపిన భర్త - తెలంగాణ వార్తలు
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను గొంతు నులిమి హత్య చేసిన ఘటన కాజీపేట మండలంలోని మడికొండలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
శేఖర్ డ్రైవర్గా పనిచేస్తుండగా... సరిత బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న శేఖర్ తరచూ గొడవపడేవాడని స్థానికులు తెలిపారు. సోమవారం రాత్రి భార్యతో ఘర్షణ పడి గొంతు నులిమి చంపేసి.. పారారయ్యాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:మెడికల్ డివైస్ పార్క్ సమీపంలో దారుణ హత్య!