husband killed his wife: వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతన్న కావాలి భీమయ్య(48) నిన్న అర్ధరాత్రి భార్య కావాలి పెంటమ్మ (45)ను గొడ్డలి కర్రతో తలపై మోది హత్య చేశాడు.అనంతరం భీమయ్య కూడా ఇంట్లో ఉన్న దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు, తమ్ముడు శ్రీశైలం కలిసి భీమయ్య ఇంటి డోర్ విరగగొట్టి లోపలికి వెళ్లి చూడగా పెంటమ్మ భీమయ్యలు మృతదేహాలు కనబడడంతో పరిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకున్న భర్త.. అసలేమైందంటే? - husband who killed his wife
husband killed his wife: వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడ్రోజులుగా మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతున్న కావలి భీమయ్య అర్ధరాత్రి తన భార్య తల మీద కర్రతో బలంగా కొట్టడటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం భీమయ్య ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు తలుపులు విరగగ్గొట్టి చూడగా దారుణం వెలుగులోకి వచ్చింది.
భార్యను హత్యచేసిన భర్త
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మతిస్థిమితం లేకనే భార్య పెంటమ్మను హత్య చేసి తనూ భయపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని బంధువులు తెలుపుతున్నారు. మృతుడు భీమయ్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు వారికి వివాహాలు జరిగినట్లు మృతుడు భీమయ్య తమ్ముడు శ్రీశైలం తెలిపారు.
ఇవీ చదవండి: