భార్యను హత్యచేసి... సహజ మరణంగా చిత్రీకరించేందుకు భర్త ప్రయత్నించిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. నాగారం మండలం పస్తాలకు చెందిన శ్రీనివాస్, సూరమాంబ(34) దంపతులు హైదరాబాద్‌లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా శ్రీనివాస్ మద్యం సేవించి తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు.
ఈ క్రమంలో రోజులాగే మంగళవారం రాత్రి మద్యం సేవించిన శ్రీనివాస్ భార్యతో గొడవపడ్డాడు. బుధవారం తెల్లవారు జామున సుమారు 2 గంటల సమయంలో దంపతులిద్దరూ తమ టాటా ఏసీ వాహనంలో కూరగాయలు కొనేందుకు వెళ్లారు. మార్గమధ్యలో ఇద్దరికి గొడవ జరగడంతో సూరమాంబ తన కూతురుకు ఫోన్‌చేసి మీనాన్న నన్ను చంపేట్లు ఉండని తెలిపింది. ఆ తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఉదయం 6గంటలకు తండ్రి శ్రీనివాస్ కూతురుకు ఫోన్‌చేసి మీ అమ్మ బీపీ తగ్గి చనిపోయిందంటూ చెప్పాడు.