జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన చిత్తారి మహేశ్‌కు తన భార్య నర్సవ్వతో తరచూ గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలో నర్సవ్వ మెదక్‌లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తీసుకురావడానికి అత్తింటికి వెళ్లిన మహేశ్.. ఇకపై గొడవపడనని హామీ ఇచ్చి నర్సవ్వను ఇంటికి తీసుకెళ్తానని బయలు దేరాడు.
క్షణికావేశంలో భార్య తలపై సుత్తెతో కొట్టి చంపిన భర్త - nizamabad district crime news
క్షణికావేశంలో భార్య తలపై సుత్తెతో మోది భర్త హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన నిందితుని కోసం గాలిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా వార్తలు, నిజామాబాద్‌లో మహిళ హత్య, నిజామాబాద్ జిల్లాలో భార్యను హత్య చేసిన భర్త
మార్గం మధ్యలో నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని కుమార్తె ఇంటి వద్ద ఆగారు. అక్కడ మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. కోపోద్రిక్తుడైన మహేశ్ క్షణికావేశంలో నర్సవ్వ తలపై సుత్తెతో మోది... అక్కణ్నుంచి పరారయ్యాడు. తీవ్రంగా రక్తస్రావమైన నర్సవ్వను కుమార్తె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మహేశ్ కోసం గాలిస్తున్నారు.
- ఇదీ చదవండి:జాతీయ ప్రత్యామ్నాయ నేత దీదీయేనా?