మేడ్చల్ జిల్లా గాజులరామారం బతుకమ్మబండలో వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. నాగర్ కర్నూల్ జిల్లా మరికల్ గ్రామానికి చెందిన సువర్ణ, రాజు అనే వ్యక్తిని పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. రెండు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి గాజులరామరం బతుకమ్మ బండలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ ఒకే మేస్త్రీ వద్ద కూలికి వెళ్తుండగా.. సువర్ణ ఆ వ్యక్తిత్తో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త రాజు పలుమార్లు హెచ్చరించాడు.
Extramarital Affair: వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను చంపిన భర్త - వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను హత్య చేసిన భర్త
వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను భర్త హతమార్చాడు. పలుమార్లు హెచ్చరించినా వినలేదని.. మరోసారి ఈ విషయంపై గొడవ జరగ్గా కోపంతో పార కర్రతో తలపై కొట్టాడు.

అక్రమ సంబంధం పెట్టుకుందని భార్యను చంపిన భర్త
నేడు భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన రాజు.. పార కర్రతో భార్య సువర్ణ తలపై కొట్టగా ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష