తెలంగాణ

telangana

ETV Bharat / crime

దారుణం: భార్యను హతమార్చిన భర్త - rangareddy district crime news

కుటుంబకలహాలతో ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హతమార్చిన ఘటన నార్సింగి పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

husband killed his wife
భార్యను హతమార్చిన భర్త

By

Published : Apr 8, 2021, 10:05 AM IST

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్​స్టేషన్​ పరిధి హైదర్​షాకోట్​లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హతమార్చాడు.

బసప్ప, పద్మమ్మలు దంపతులు. హైదర్​షాకోట్​లో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే భర్త బసప్ప పద్మమ్మను దారుణంగా హత్యచేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోతుండగా.. స్థానికులు వెంబడించి పట్టుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న పద్మమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బసప్ప గతంలోనూ రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి: డివైడర్​ను ఢీకొన్న లారీ.. మేకలు మృతి

ABOUT THE AUTHOR

...view details