Husband Harasses wife in Hyderabad : కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా భార్యతో ప్రమాణం చేశాడు. కొన్నేళ్లలోనే అవన్నీ మర్చిపోయాడు. ఇటీవల కొంత కాలంగా ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరగడం ప్రారంభించాడు. ఖర్చులకు డబ్బు లేక భార్యను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. అనుకున్నది జరక్కపోయే సరికి.. పడక గదిలో భార్య అశ్లీల దృశ్యాలను తన చరవాణిలో ఆమెకు తెలియకుండా రికార్డు చేసి సోషల్ మీడియా ద్వారా స్నేహితుడికి పంపించాడు.
'అదనపు కట్నం తీసుకురా.. లేదా నా ఫ్రెండ్‌తో ఏకాంతంగా గడుపు' - Husband Harasses wife for dowry in Hyderabad
Husband Harasses wife in Hyderabad : తల్లిదండ్రులు మంచి అబ్బాయి అని చెప్పగానే ముందూ వెనక ఆలోచించకుండా పెళ్లి చేసుకుంది. ఎన్నో ఆశలతో ఆమె తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. కానీ ఆ ప్రబుద్ధుడు పెళ్లినాట చేసిన ప్రమాణాలు మరిచాడు. పెళ్లైన కొన్నిరోజుల తర్వాత అసలు రూపం బయటపెట్టాడు. చేస్తున్న పనని మానేసి.. జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు. చేతిలో చిల్లి గవ్వలేక భార్యను అదనపు కట్నం కోసం వేధించాడు. అనుకున్నది జరగకపోయేసరికి భార్యను తన స్నేహితుడితో ఏకాంతంగా గపడాలంటూ వేధించడం మొదలుపెట్టారు. అతని వేధింపులు భరించలేక ఆ మహిళ హైదరాబాద్ శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది.
ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు భర్తను నిలదీసింది. అదనపు కట్నం తీసుకురా.. లేదా నా స్నేహితుడితో ఏకాంతంగా గడుపు అని ఆమెను తన భర్త ఒత్తిడి చేశాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. అతని తీరు మారలేదు. వేదన భరించలేక ఆమె చివరకు శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది. భర్త, అత్తమామలతో పాటు మరో ముగ్గురిపై ఆదివారం కేసు నమోదు చేశారు.
శంషాబాద్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. శంషాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి(35) 2016లో మహిళ(27)ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో రూ.5 లక్షల నగదు, 9 తులాల బంగారు ఆభరణాలు, లక్షల విలువైన ఇతరత్రా గృహోపకరణాలు తీసుకున్నాడు. జరిగిన ఘోరాన్ని అత్త, మామల దృష్టికి తీసుకెళ్లగా కుమారుడు చేసిన నిర్వాకాన్ని సమర్థించి అదనపు కట్నం తేవాలని హెచ్చరించారు. పైగా భర్త బంధువులు దాడి చేసి మెట్టినింటికి పంపించారు.