Husband killed his wife: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో భార్యను సుత్తితో కొట్టి భర్త హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మార్కెట్ సెంటర్లోని రైల్వే ట్రాక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యను హత్య చేసిన అనంతరం భర్త తమ్మిశెట్టి వెంకట్రావు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు.. వెంకట్రావును చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు.
భార్యాభర్తలు నరసరావుపేట మండలం గురవాయిపాలెంకు చెందినవారిగా రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రోసూరు మండలం అందలూరుకు చెందిన తమ్మిశెట్టి వెంకట్రావు నరసరావుపేట మండలం గురవాయిపాలెంకు చెందిన పద్మను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో.. పద్మ కుటుంబ సభ్యులు ఆమెను పుట్టింటికి తీసుకువచ్చారు. ఆమెను కాపురానికి పంపించాలని వెంకట్రావు నరసరావుపేటలోని తన భార్య బంధువులను కోరాడు. కానీ వాళ్ళు మీ అమ్మ, నాన్నలను తీసుకువచ్చి మాట్లాడాలని తెలిపారు.