తెలంగాణ

telangana

ETV Bharat / crime

భార్య చూస్తుండగానే భవనం పైనుంచి దూకేసిన భర్త - person commits suicide by jumping from a building

Husband committed suicide by jumping from the building: పెళ్లినాటి ప్రమాణాల్లో కష్టసుఖాల్లో చనిపోయినంతా వరకూ ఒకరికోకరు తోడుగా ఉంటామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భార్యభర్తలు.. వారి మధ్య అప్పుడప్పుడు వచ్చిన చిన్న చిన్న వివాదాలతో క్షణికావేశానకి గురై ఇలా జీవితాలను అందకారంలోకి నెట్టిసి పోతున్నారు. భార్యభర్తల మధ్య వచ్చిన వివాదాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప క్షణికావేశ నిర్ణయాలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఏం జరుగుతుందో హైదరాబాద్​లోని నార్సింగిలో జరిగిన ఈ ఘటనే మనకు చెబుతోంది.

Husband committed suicide
Husband committed suicide

By

Published : Feb 7, 2023, 1:52 PM IST

Husband committed suicide by jumping from the building: హైదరాబాద్‌ శివారు నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. భార్య చూస్తుండగానే భర్త భవనం పైనుంచి దూకేశాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పీరంచెరువు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం రేవన్‌ సిద్ధప్ప అనే వ్యక్తికి తన భార్యతో చిన్నపాటి గొడవ జరిగింది.

ఈ క్రమంలో తీవ్ర ఆవేదనకు గురైన రేవన్‌ సిద్ధప్ప.. ఒక్కసారిగా భవనం పైనుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేవన్‌ మృతిచెందాడు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details