నల్గొండ జిల్లా బుద్దారం గ్రామంలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాములమ్మ, శామయ్య భార్యాభర్తలు. వారిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. నిన్న రాత్రి భార్యాభర్తలకు జరిగిన గొడవలో రాములమ్మ(50)ను భర్త ఇనుప రాడ్డుతో కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. శామయ్య(55) భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. భార్యాభర్తలను నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను చంపి.. భయంతో భర్త ఆత్మహత్య - బుద్దారంలో భార్యను చంపిన భర్త
నల్గొండ జిల్లా బుద్దారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను కడతేర్చాడు. ఆ తర్వాత భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బుద్దారం, భార్యను చంపిన భర్త