double murder in Kurnool : కర్నూలు జిల్లా హెళుగుంద మండలంలోని కోయిలతోట గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితి గాయత్రితో పదేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల గాయత్రి.. అదే గ్రామానికి చెందిన హనుమంతప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్యలో వచ్చిన మార్పును గమనించిన శ్రీనివాస్ ఏమైందోనని ఆరా తీయడం మొదలుపెట్టాడు. కానీ అతనికి కారణాలేమీ తెలియలేదు. ఓరోజు.. అనుకోకుండా గాయత్రి ఫోన్ చూశాడు. ఆ మొబైల్ గ్యాలరీలో ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూసి.. ఆమెలో మార్పునకు కారణం తెలుసుకున్నాడు. కానీ అప్పుడే ఆమెను నిలదీయలేదు. వాళ్లిద్దర్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. సరైన సమయం కోసం వేచి చూశాడు.
ప్రియుడితో ఉన్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. ఏం చేశాడంటే? - Husband Killed Wife and Her Lover
double murder in Kurnool : పెళ్లైన పదేళ్ల తర్వాత.. భార్యలో అకస్మాత్తుగా వచ్చిన మార్పును చూసి షాకయ్యాడు ఆ భర్త. ఏం జరిగి ఉంటుందోనని ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఓసారి అనుకోకుండా ఆమె మొబైల్ చూశాడు. అందులో వేరే వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూసి భార్యలో వచ్చిన మార్పునకు కారణం తెలుసుకున్నాడు. ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని పక్కా ప్లాన్ వేశాడు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటీ..? తన భార్య వివాహేతర సంబంధాన్ని ఆ భర్త ఎలా బయటపెట్టాడు?
Wife Caught Cheating in Kurnool : గురువారం రోజున రాత్రి శ్రీనివాస్ ఇంటి నుంచి ఏదో పనిమీద బయటకు వెళ్లాడు. వెళ్లేటప్పుడు భార్యతో ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పాడు. భర్త ఆలస్యంగా వస్తానని చెప్పడంతో గాయత్రి తన ప్రియుడు హనుమంతప్పకు కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్లిన శ్రీనివాస్.. బయటకు వెళ్తానని చెప్పి ఇంటి దగ్గరే వాళ్లకు కనబడకుండా దాక్కున్నాడు. హనుమంతప్ప వచ్చిన కాసేపటికి ఇంట్లోకి వెళ్లాడు. ఏకాంతంగా ఉన్న గాయత్రీ-హనుమంతప్పలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.
Husband Killed Wife and Her Lover : తన భార్యతో సన్నిహితంగా ఉన్న హనుమంతప్పను గొడ్డలితో విచక్షణారహితంగా నరికాడు. ఆ తర్వాత వాళ్లు సన్నిహితంగా ఉన్న వీడియోలు చూపించి గాయత్రిని నిలదీశాడు. కోపంతో ఆమెను కూడా హతమార్చాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య వివాహేతర సంబంధం వల్లే శ్రీనివాస్ ఆమెను, ఆమె ప్రియుడు హనుమంతప్పను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.