తెలంగాణ

telangana

ETV Bharat / crime

Wife killed Husband: మద్యం తాగొచ్చి తరచూ వేధిస్తున్నాడని.. పెట్రోల్​ పోసి.. - Husband Murder by Wife at giddalur

wife killed husband: మద్యానికి బానిసైన భర్త వేధింపులు భరించలేక.. అతనిని కడతేర్చింది ఓ భార్య. రోకలిబండతో దాడి చేసి పెట్రోల్​ పోసి నిప్పంటించింది. అనంతరం పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయింది. ఏపీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

By

Published : Jan 17, 2022, 1:09 PM IST

wife killed husband: మద్యానికి బానిసై తరచూ వేధిస్తున్నాడని.. కట్టుకున్న భర్తను హతమార్చింది ఓ ఇల్లాలు. ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా గిద్దలూరులోని శ్రీరామ్ నగర్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. రోకలి బండతో దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించింది. అనంతరం పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయింది. మద్యం తాగొచ్చి తరచూ.. వేధింపులకు గురి చేస్తుండటంతో విసిగిపోయిన తాను.. ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది.

గిద్దలూరుకు చెందిన అంకాలమ్మ, అంజి అలియాస్ చిరంజీవికి 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. మొదట్లో బాగానే ఉన్న అంజి.. తర్వాత తరచూ మద్యం సేవించి భార్యను వేధింపులకు గురి చేసేవాడని స్థానికులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో అంకాలమ్మ ఆగ్రహంతో.. రోకలిబండతో దాడికి పాల్పడింది. అనంతరం తీవ్రంగా గాయపడ్డ భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. అంజి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తరువాత అంకాలమ్మ పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీచదవండి:Boy Died: పల్లీలు తింటుండగా గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details