వివాహేతర సంబంధం అనుమానంతో ఓ భర్త.. భార్యను కత్తితో కడుపులో పొడిచిన దారుణ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మహిళను చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
సిద్దిపేటకు చెందిన రాజు, చిన్నకోడూర్లోని లలిత నాలుగు ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల నుంచి ఆమె ప్రవర్తనలో మార్పు రావటంతో భర్తకు అనుమానం కలిగింది. ఈరోజు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. రాజు కత్తితో లలిత కడుపులో పొడిచాడు.