ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే కడతేర్చాలని చూశాడు. కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన మౌల్కర్ సత్యనారాయణ... బెల్లంపల్లి మాలగురిజల గ్రామానికి చెందిన వెన్నెలను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
వ్యవసాయ చెక్‌పోస్టు వద్ద భార్యపై కత్తితో దాడి - telangana varthalu
కట్టుకున్నవాడే భార్యను కడతేర్చాలని చూశాడు. పుట్టింటికి వెళ్తుండగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఏఎస్పీ సుధీంద్ర గమనించడంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బోరిగాం శివారులో జరిగింది.
విషయం తెలుకున్న పుట్టింటి వారు సోమవారం రాత్రి వచ్చి వెన్నెలను తమతో తీసుకువెళ్తుండగా... ఈ విషయం తెలుసుకుని భర్త సత్యనారాయణ వెంబడించాడు. బోరిగాం శివారు వ్యవసాయ చెక్ పోస్ట్ వద్ద వారిని ఆపి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇదే సమయంలో అటుగా వస్తున్న ఏఎస్పీ సుధీంద్ర.. సత్యనారాయణను అడ్డుకుని వెన్నెలను కాపాడాడు. బాధితురాలిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు.
ఇదీ చదవండి: ఉరేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య