తెలంగాణ

telangana

ETV Bharat / crime

Husband Attack On Wife: క్షణికావేశం.. భార్యను కత్తితో పొడిచిన భర్త - హయత్ నగర్ డివిజన్​లో ఘటన

జీవితాంతం తోడుగా నిలవాల్సిన భర్త ఆమెనే అంతమొందించేందుకు యత్నించాడు. క్షణికావేశంలో భార్యను కత్తితో పొడిచేశాడు. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో ఆస్పత్రి చికిత్స పొందుతోంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లో చోటు చేసుకుంది.

Husband attack on wife
భార్యను కత్తితో పొడిచిన భర్త

By

Published : Feb 6, 2022, 10:37 AM IST

భర్త క్షణికావేశం భార్యపై హత్యాయత్నానికి దారితీసింది. ఇద్దరి మధ్య గొడవ తలెత్తడంతో ఆగ్రహానికి లోనైన భర్త... భార్యను కత్తి పొడిచాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

పనికి వెళ్లడం లేదని...

హయత్ నగర్ డివిజన్ పరిధిలోని సుధీర్ కుమార్ కాలనీలో రేణుక, వెంకటేశ్ దంపతులు నివాసముంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు సంతానం కూడా ఉన్నారు. రేణుక వృత్తిరీత్యా నర్సుగా పనిచేస్తోంది. ఆమె భర్త పనులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి ఆంధ్రాబ్యాంక్ కాలనీలోని గోపీ కృష్ణ టెంపుల్ పక్కనే భార్య రేణుకను వెంకటేశ్ చాకుతో పొడిచాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం తీవ్రంగా గాయపడ్డ రేణుకను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న భర్త వెంకటేశ్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details