ఖమ్మంలో దారుణం చోటుచేసుకుంది. టీఎన్జీవో కాలనీలో ఓ వ్యక్తి తన భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రోడ్డు పక్కన ముళ్ల పొదల్లోకి భార్యను లాక్కెళ్లి హతమార్చేందుకు యత్నిస్తుండగా... బాధితురాలి కేకలు విని స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. రాళ్లతో దాడి చేసి మహిళను కాపాడి... నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
కట్టుకున్న భార్యపై ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి హత్యాయత్నం - telangana news
కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి హతమార్చేందుకు యత్నించాడు. ఈ దారుణ ఘటన ఖమ్మంలోని టీఎన్జీవో కాలనీలో చోటుచేసుకుంది.
కట్టుకున్న భార్యపై ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి హత్యాయత్నం
కుటుంబ కలహాలతో నాలుగేళ్లుగా దంపతులు నాగేశ్వర్‌రావు, నవ్యలు వేరువేరుగా ఉంటున్నారు. భర్త వద్ద ఉంటున్న పిల్లలను నవ్య రెండ్రోజుల క్రితమే తనతో తీసుకువెళ్లింది. పిల్లలను తీసుకువెళ్లిందనే కోపం పెంచుకున్న నాగేశ్వర్‌రావు... భార్యను హతమార్చేందుకు యత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. భర్తదాడిలో తీవ్రంగా గాయపడిన నవ్యను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: 40 ఏళ్ల వివాహ బంధం.. మిగిల్చింది విషాదం.!
Last Updated : Mar 3, 2021, 8:26 PM IST