Husband and wife washed away in the stream of water: పండుగకని కారులో భార్యాభర్తలు వేరే ఊరు వెళ్లారు.. అటునుంచి వచ్చేటప్పుడే భారీవర్షం మొదలైంది. వర్షం వచ్చిన మెల్లగా ఇంటికి చేరుకోవచ్చు అనుకున్నారు. కానీ అప్పుడే నాగారం గ్రామం వద్ద కోకట్ వాగులో నీటి ప్రవాహం బ్రిడ్జ్ పై నుంచి ప్రవహిస్తోంది. ప్రవాహం తక్కువగా ఉందనుకోని కారును బ్రిడ్జి పైనుంచి పోనిచ్చారు. అయితే ఇంతలోనే ప్రవాహం ఎక్కువ అవ్వడంతో కారు ఆ నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దారూర్ మండలం నాగారం గ్రామం వద్ద జరిగింది.
నీటిలో కొట్టుకుపోయిన భార్యభర్తలు.. అదృష్టం అంటే వీళ్లదే!!
Husband and wife washed away in the stream of water: వాగులో కారు కొట్టుకుపోయిన పోయిన సంఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. అర్ధరాత్రి తరువాత కురిసిన భారీ వర్షాలకు తాండూరు కాగ్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహానికి దారూర్ మండలం నాగారం గ్రామం వద్ద కోకట్ వాగుకు నీరు ఎక్కువగా చేరుతోంది.
భార్యాభర్తలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు
అయితే ఈ ఘటనలో కారులో ఉన్న భార్యభర్తలు శివ, లాస్య అదృష్టవంతులని చెప్పవచ్చు. కారు వాగు దగ్గరలో ఉన్న చెట్టుకి అనుకోని ఉండిపోయింది. దీనితో వారు చెట్టు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. రక్షించాలంటూ తమ దగ్గర ఉన్న సెల్ఫోన్ టార్చిను వేస్తే స్థానికులు చూశారు. రాత్రి సమయం కావడంతో వారు అక్కడే ఉండిపోయారు. ఉదయం వారిని తాడు సాాయంతో కాపాడారు. జేసీబీతో కారును నీటి నుంచి బయటకు తీసుకొచ్చారు.
ఇవీ చదవండి: