తెలంగాణ

telangana

ETV Bharat / crime

భార్యను కొట్టి చంపిన భర్త.. సహకరించిన కుమారులు - husband and sons killed woman in gajula ramaram

Husband and Sons killed Woman: దాంపత్య బంధం ఓ వైపు.. రక్తం పెంచిన బంధం మరోవైపు.. ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్నాయి. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా భర్త.. నవమోసాలు మోసి కనిపెంచిన తల్లి అని కనికరం లేకుండా.. ఆ మహిళ పట్ల యమకింకరులుగా మారారు. తల్లిపై తండ్రి దాడిని ఖండించాల్సింది పోయి ఆ సుపుత్రులే తండ్రికి మద్దతుగా నిలిచారు. ఫలితంగా కన్న తల్లి చావుకు కారణమై.. ప్రస్తుతం ముగ్గురూ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు.

husband and sons killed woman
నిందితులు

By

Published : May 1, 2022, 11:11 AM IST

Husband and Sons killed Woman: భార్యపై అనుమానంతో భర్త కొట్టి చంపుతుంటే.. కుమారులే సహకరించిన దారుణ ఘటన మేడ్చల్‌ జిల్లాలో వెలుగుచూసింది. గాజులరామారం బతుకమ్మబండకు చెందిన బాలకృష్ణ, మమతకు 23 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారులు ఇంటర్‌లోనే చదువు మానేసి తండ్రితో పాటు ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు.

మహిళను హత్య చేసిన తండ్రీకుమారులు

ఏడాదిగా భార్యపై అనుమానంతో బాలకృష్ణ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమెను గృహనిర్బంధం చేశాడు. దీంతో వేధింపులు తాళలేక ఈ ఏడాది జనవరిలో మమత తన కూతురితో పాటు ఇంటినుంచి వెళ్లిపోయింది. ఆచూకీ తెలుసుకుని మళ్లీ ఇంటికి తీసుకొచ్చిన బాలకృష్ణ.. వారం రోజులుగా ఆమెతో గొడవ పడుతున్నాడు. కుమార్తె కూడా తల్లికి సహకరిస్తుందనే అనుమానంతో చదువు మాన్పించారు.

ఏప్రిల్‌ 29(శుక్రవారం)న వారి మధ్య కొట్లాట ముదరగా.. మమతను ఇంట్లో కట్టేసి కూతురి ముందే కొట్టి చంపాడు. దీనికి కుమారులు సైతం సహకరించారు. చెల్లెలు గట్టిగా అరవడంతో ఆమెను కూడా చంపేస్తామని బెదిరించారు. పైగా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. బాలకృష్ణ, కుమారులు శివశంకర్‌, లక్ష్మణ్‌ను రిమాండ్‌కు తరలించారు.

ఇవీ చదవండి:రైల్వేస్టేషన్‌లో దారుణం.. భర్తను కొట్టి భార్యపై సామూహిక అత్యాచారం

గుప్తనిధుల కోసం తండ్రినే బలి ఇవ్వబోయిన కుమారుడు

ABOUT THE AUTHOR

...view details