గుప్తనిధుల కోసం పురాతన ఆలయంలో తవ్వకాలు జరిపిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలంలో కలకలం రేపింది. కోగిల్వాయి గుట్టల వద్ద శివాలయంలో.. గుర్తు తెలియని వ్యక్తులు గోతులు తవ్వారు.
గుప్త నిధుల వేట.. పురాతన ఆలయంలో తవ్వకాలు - గుప్త నిధుల వేట
వరంగల్ రూరల్ జిల్లాలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. దామెర మండలంలోని ఓ పురాతన ఆలయంలో తవ్వకాలు జరిగిన ఆనవాళ్లు లభించాయి.
గుప్త నిధుల వేట.. పురాతన ఆలయంలో తవ్వకాలు
స్థానికుల ఫిర్యాదు మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆలయ పరిసరాలను గమనించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:సెల్ఫీ మోజులో నీటిమునిగి యువకుడు మృతి