తెలంగాణ

telangana

ETV Bharat / crime

'రూ.వంద కోట్ల విలువైన సాఫ్ట్​వేర్​, రూ.15 లక్షలు చోరీ' - ap news

ఏపీలోని కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పునాదిపాడు పరిధిలో ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థలో అవకతవకలు జరిగినట్లు కంకిపాడు పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు అయ్యింది. వంద కోట్ల విలువైన సాఫ్ట్​వేర్​, పదిహేను లక్షల నగదు తేడా వచ్చినట్లు ప్రస్తుత ఏజీఎం ఫిర్యాదులో పేర్కొన్నారు.

theft
theft

By

Published : May 30, 2021, 10:49 PM IST

ఏపీలోని కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పునాదిపాడు పరిధిలో ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థలో అవకతవకలు జరిగినట్లు ప్రస్తుత ఏజీఎం మురళీకృష్ణ కంకిపాడు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రూ.వంద కోట్ల విలువైన సాఫ్ట్​వేర్​, పదిహేను లక్షల నగదు అవకతవక జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కళాశాలలో గతంలో ఎగ్జిక్యూటివ్​ డీన్​గా పని చేసిన నరేంద్రబాబు మరో నలుగురు సిబ్బంది ఈ అవకతవకలకు పాల్పడ్డారని… మురళీకృష్ణ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నరేంద్రబాబు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గోసలైట్స్ కోచింగ్ సెంటర్​లో… తమ కాలేజీ విద్యార్థులను చేర్పించాలని వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారని మురళీకృష్ణ ఆరోపిస్తున్నారు. చోరీ చేసిన సాఫ్ట్​వేర్​, నగదు తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. మురళీ కృష్ణ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దుర్గారావు తెలిపారు.

ఇదీ చూడండి:Lockdown Extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details