Mother sold daughter: తరాలు మారినా, యుగాలు మారినా అబల పట్ల వివక్షత కొనసాగుతూనే ఉంది. కామంతో మత్తెక్కిన మూర్ఖులు మానసికంగా, శారీరకంగా మహిళలను హింసిస్తూనే ఉన్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన రక్తసంబంధీకులే కాదంటున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా మనసుల్ని పిండేసే అలాంటి విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 61 ఏళ్ల వయస్సు గల వ్యక్తికి 14 ఏళ్ల అమ్మాయిని కన్నతల్లే అమ్మడానికి ప్రయత్నించింది.
14 ఏళ్ల కుమార్తెను అమ్మేందుకు ప్రయత్నించిన తల్లి అరెస్టు - ts news
Mother sold daughter: మనసుల్ని పిండేసే విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవమోసాలు కనిపెంచి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే తన 14 ఏళ్ల కూతురిని 61 ఏళ్ల వయసున్న వ్యక్తికి అమ్మేందుకు యత్నించింది. ఆమెతో సహా మొత్తం 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
![14 ఏళ్ల కుమార్తెను అమ్మేందుకు ప్రయత్నించిన తల్లి అరెస్టు Mother sold daughter: 14 ఏళ్ల కుమార్తెను అమ్మేందుకు ప్రయత్నించిన తల్లి అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14274051-686-14274051-1643057758142.jpg)
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 61 సంవత్సరాల వ్యక్తికి... తన 14 ఏళ్ల కుమార్తెను అమ్ముతున్న ఓ తల్లిని పోలీసులు పట్టుకున్నారు. ఎర్రకుంట ప్రాంతానికి చెందిన ఆశిర బేగం తన కూతురిని 3 లక్షలకు అమ్మేందుకు సిద్ధపడగా.. సమాచారం అందుకున్న పోలీసులు... మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఇందులో బాధితురాలి తల్లితో పాటు అమ్మమ్మ కూడా ఉంది. ముంబయికి చెందిన 61 ఏళ్ల అల్తాఫ్... తనకు ఓ అమ్మాయి కావాలంటూ మధ్యవర్తులను సంప్రదించాడు. వాళ్లు ఆశిర బేగం కుమార్తెను చూపించగా బాధితురాలి తల్లి మొదట 5 లక్షలు డిమాండ్ చేయడంతో ఆ డీల్ జరగలేదు. తర్వాత బాధితురాలి తల్లి మరోసారి అతడిని సంప్రదించి మూడు లక్షలకు డీల్ కుదుర్చుకుంది. తన 14 ఏళ్ల కుమార్తెను అమ్మేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు..
ఇదీ చదవండి: