Theft in Medchal: హైదరాబాద్ నగరంలో దసరా పండుగ వేళ దొంగలు అనుకున్నంత పని చేశారు. దైవదర్శనం కోసం తిరుపతి వెళ్లి.. తిరిగి వచ్చేలోపు గుర్తు తెలియని దుండగులు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు, 24 తులాల వెండితో పాటు కొంత నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం బండ్లగూడలో చోటుచేసుకుంది.
బండ్లగూడలో నివాసం ఉండే శ్రవణ్‌కుమార్ దసరా సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. వెళ్లే ముందు కష్టపడి పైసాపైసా కూడబెట్టి సంపాదించిన బంగారం, వెండి ఆభరణాలతో పాటు కొంత డబ్బు బీరువాలో దాచి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు.. ఇంట్లో ఎవరూ లేనిది చూసి తాళాలు పగులగొట్టి దొరికిన కాడికి దోచుకెళ్లారు.