ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఓ బంగారం దుకాణంలో పనిచేసే సత్యనారాయణ... హైదరాబాద్ నుంచి ఒక కేజీ 818 గ్రాముల బంగారు అభరణాలను ఓ ప్రైవేటు బస్సులో తీసుకువస్తున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు కర్నూలు సరిహద్దులోని పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు.
Gold seize: భారీగా బంగారు ఆభరణాలు పట్టివేత
ఏపీలోని కర్నూలు జిల్లా సరిహద్దులో ఉన్న పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. అనుమతులు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు.
కర్నూలులో బంగారం పట్టివేత
పోలీసులు సోదాల్లో అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ సుమారు రూ.1.80 కోట్లు ఉంటుందని ఎస్ఈబీ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. బంగారు ఆభరణాలను సీజ్ చేసి తాలూకా పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: KTR: అద్భుత పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి