తెలంగాణ

telangana

ETV Bharat / crime

భద్రాచలంలో రూ.60 లక్షల గంజాయి సీజ్​ - huge amount of marijuana seized at badrachalam

భద్రాచలంలో పోలీసులు మరోసారి భారీస్థాయిలో గంజాయి పట్టుకున్నారు. ఒడిశా​ నుంచి హైదరాబాద్​కు తరలిస్తోన్న 300 కిలోల గంజాయిని సీజ్​ చేశారు. దీని విలువ సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

భద్రాచలంలో రూ.60 లక్షల విలువైన గంజాయి సీజ్​
భద్రాచలంలో రూ.60 లక్షల విలువైన గంజాయి సీజ్​

By

Published : Jul 31, 2021, 5:42 PM IST

తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్​గఢ్​​, ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. తాజాగా ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి తరలిస్తున్న ముఠాను భద్రాచలం పోలీసులు అరెస్ట్ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చెక్​పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అటుగా వస్తోన్న ఓ ద్విచక్రవాహనం, కారులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వాహనాలను ఆపి తనిఖీ చేయగా.. సుమారు 300 కిలోల గంజాయి లభించింది. దీని విలువ సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

నిందితులు శీలం రాజశేఖరరెడ్డి, సాధం సతీశ్​, ఆలూరి జయమ్మగా పోలీసులు వెల్లడించారు. వీరు ఖమ్మం జిల్లాలోని తల్లాడ, వైరా మండలాలకు చెందిన వారిగా తెలిపారు. గంజాయిని ఒడిశా నుంచి హైదరాబాద్​కు తరలిస్తున్నట్లు చెప్పారు. నిందితులను రిమాండ్​కు తరిలించి, వాహనాలను, గంజాయిని సీజ్ చేశామని వివరించారు.

గతంలో 1005 కిలోల గంజాయి సీజ్​..

ఇదే చెక్​పోస్టు వద్ద 10 రోజుల క్రితం సుమారు 1005 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. గంజాయిని లారీలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. మధ్యప్రదేశ్​కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, లారీని సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. భద్రాచలం కేంద్రంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమంగా గంజాయి రవాణా సాగుతోందని ఆయన అన్నారు.

సమాచారమిస్తే.. రివార్డు..

ఎవరైనా గంజాయి తరలిస్తున్నట్లు తమకు సమాచారం ఇస్తే వారికి రివార్డు ఇస్తామని ఎస్పీ సునీల్​ దత్ గతంలో ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చెక్​పోస్టుల వద్ద 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసలై గంజాయి రవాణాకు పాల్పడవద్దని సూచించారు.

Cannabis seize : పైన దానిమ్మ పండ్లు... లోపల భారీగా గంజాయి ప్యాకెట్లు

ABOUT THE AUTHOR

...view details