తెలంగాణ

telangana

ETV Bharat / crime

Marijuana seized: భద్రాచలంలో రూ.2 కోట్ల విలువైన గంజాయి సీజ్​ - గంజాయి సీజ్​

భద్రాచలంలో మరోసారి భారీస్థాయిలో గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్​ నుంచి మధ్యప్రదేశ్​కు తరలిస్తున్న 1005 కిలోల గంజాయిని సీజ్​ చేశారు. దీని విలువ దాదాపు రూ. రెండు కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Marijuana seized at bhadrachalam
రూ.2 కోట్ల విలువైన గంజాయి సీజ్​

By

Published : Jul 21, 2021, 5:45 PM IST

తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్​గడ్​, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి జోరుగా గంజాయి రవాణా కొనసాగుతోంది. తాజాగా ఏపీలోని సీలేరు అటవీప్రాంతం నుంచి మధ్యప్రదేశ్​కు గంజాయి తరలిస్తున్న ముఠాను భద్రాచలం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1005 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

వాటి విలువ దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. భద్రాచలం చెక్​పోస్ట్​ వద్ద చేపట్టిన తనిఖీల్లో లారీలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. మధ్యప్రదేశ్​కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, లారీని సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. భద్రాచలం కేంద్రంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమంగా గంజాయి రవాణా సాగుతోందని ఆయన అన్నారు.

సమాచారం ఇస్తే రివార్డులు

ఎవరైన గంజాయి తరలిస్తున్నట్లు తమకు సమాచారం ఇస్తే వారికి రివార్డు ఇస్తామని ఎస్పీ సునీల్​ దత్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చెక్​పోస్టుల వద్ద 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసలై గంజాయి రవాణాకు పాల్పడవద్దని సూచించారు.

భద్రాచలం చెక్​ పోస్ట్​ వద్ద పోలీసులు తనిఖీల్లో ఓ లారీలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నాం. ఒడిశా సరిహద్దు ప్రాంతమైన సీలేరు నుంచి మధ్యప్రదేశ్​కు తరలిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించాం. మొత్త 1005 కిలోల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నాం. దీని విలువ రూ.2 కోట్లకు పైగా ఉంటుంది. పోలీసులు ప్రతిరోజు తనిఖీలు చేపడుతున్నా గంజాయి రవాణా జరుగుతూనే ఉంది. ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల నుంచి ఎక్కువ తరలిస్తున్నారు. ఒడిశాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కూడా గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించాం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి అధికంగా రవాణా అవుతోంది. భద్రాచలంలో ఎవరికైనా సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు తెలపాలని కోరుతున్నాం

-సునీల్​ దత్​, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ

నిన్న రూ.3 కోట్ల గంజాయి పట్టివేత

నిన్న కూడా భారీస్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం చెక్‌పోస్టు లారీలో తరలిస్తున్న సుమారు వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:

భద్రాద్రిలో రూ.3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

Son murdered father: రూ.200 ఇవ్వలేదని తండ్రినే చంపేశాడు..

ABOUT THE AUTHOR

...view details