తెలంగాణ

telangana

ETV Bharat / crime

తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు.. మునుగోడుకి తరలిస్తుండగా భారీగా పట్టుబడిన నగదు - రంగారెడ్డిలో అక్రమ నగదు పట్టివేత

మునుగోడు ఉపఎన్నిక దృష్ట్యా పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేయగా.. పలుచోట్ల భారీగా నగదు పట్టుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద కోటి, ఇబ్రహీంపట్నం వద్ద 65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నార్సింగి వద్ద పట్టుబడ్డ కోటి డబ్బు తరలింపు వెనుక కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి బంధువులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

illegal money was seized in Ranga Reddy
అక్రమ నగదు

By

Published : Oct 22, 2022, 10:59 PM IST

మునుగోడు ఉపఎన్నిక దృష్ట్యా పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేయగా పలుచోట్ల భారీగా నగదు పట్టుబడుతోంది. రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద కోటి, ఇబ్రహీంపట్నం వద్ద 65 లక్షలు పట్టుకున్నారు. నార్సింగి వద్ద పట్టుబడ్డ కోటి డబ్బు తరలింపు వెనుక కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి బంధువులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వనస్థలిపురం ఎన్‌జీవో కాలనీకి చెందిన దేవల్‌రాజు, కార్వాన్‌కు చెందిన శ్రీకాంత్‌ సాగర్‌ వెంకట్‌ ఫామ్స్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే సంస్థలో పనిచేసే విజయ్‌ కుమార్‌, దేవులపల్లి నగేష్‌, దాసర్‌ లూథర్‌ కలిసి రెండు కార్లు, ద్విచక్ర వాహనంలో కోటి రూపాయలు తరలిస్తుండగా... నార్సింగ్‌ రోటరీ వద్ద అనుమానం వచ్చి పోలీసులు వాహనాలను ఆపి తనిఖీ చేయగా మూడు వాహనాల్లో... మూడు భాగాలుగా తరలిస్తున్న కోటి రూపాయల నగదు బయటపడింది.

నగదు మునుగోడుకు తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. తనిఖీల సమయంలో వాహనాలు నిలపకపోవడంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ సొమ్మును మునుగోడులోని కోమటిరెడ్డి రాజేందర్‌రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సుమంత్‌రెడ్డికి అందజేయడానికి తీసుకువెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. కోమటిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, సుమంత్‌రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్‌రెడ్డి, సునీల్‌రెడ్డి పరారీలో ఉన్నట్టు మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కారులో తరలిస్తున్న 64 లక్షల 63 వేలు రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఓటర్లకు పంచేందుకే తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో వాహనాన్ని తనిఖీ చేయగా... నగదుతో దొరికిపోయారు. సొమ్ము తీసుకెళుతున్న వ్యక్తులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో డబ్బును స్వాధీనంచేసుకున్న పోలీసులు సరైన పత్రాలు చూపించి తీసుకోవాలని పోలీసులు వారికి సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details