Hawala Cash Seized in Hyderabad: హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్మును పోలీసులు పట్టుకున్నారు. ద్విచక్రవాహనంపై తరలిస్తున్న కోటీ 27 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఫణికుమార్ ద్విచక్రవాహనంపై కోటీ 27 లక్షల రూపాయలు తీసుకెళ్తున్నాడనే పక్కా సమాచారంతో తనిఖీ చేయగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.
మునుగోడు ఉపఎన్నిక వేళ మరోసారి భారీగా హవాలా డబ్బు పట్టివేత - కోటి 27 లక్షల హవాలా డబ్బు పట్టివేత
Hawala Cash Seized in Hyderabad: హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్మును పోలీసులు పట్టుకున్నారు. ద్విచక్రవాహనంపై తరలిస్తున్న కోటీ 27 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Hawala Cash Seized
నగదుకు సంబంధించి ఎటువంటి రశీదు చూపకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంబర్‌పేట్‌కు చెందిన మన్నె శ్రీనివాస్, విశ్వనాథశెట్టి ఆదేశాల మేరకు నగదు తరలిస్తున్నట్టు తెలిపాడు. పోలీసులు వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కవాడిగూడలోని పారామల్ అనే వ్యక్తికి నగదు అందజేయడానికి వాహనంలో తరలిస్తున్నట్టు తేలింది. పారామల్ ఎవరు..? నగదును అతని కోసమేనా..? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవీ చదవండి: