తెలంగాణ

telangana

ETV Bharat / crime

Drugs Case: వరంగల్​లో గుప్పుమన్న డ్రగ్స్​.. మూడేళ్లుగా సాగుతున్న వ్యవహారం..! - warangal drugs case

వరంగల్​లో మాదకద్రవ్యాల మత్తు గుప్పుమంది. గోవా నుంచి నగరానికి గుట్టుగా డ్రగ్స్​ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులు పోలీసుల చేతికి చిక్కారు. మూడేళ్లుగా ఎవరికీ తెలియకుండా డ్రగ్స్​ తీసుకుంటున్న యువకులు పట్టుబడ్డారు. వివిధ రకాల మత్తు పదార్థాలతో పాటు వాటిని వినియోగించే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

huge amount of drugs caught in warangal and 6 members arrested
huge amount of drugs caught in warangal and 6 members arrested

By

Published : Nov 5, 2021, 7:32 PM IST

వరంగల్​లో మత్తు పదార్థాలు కలకలం సృష్టించాయి. వరంగల్​ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే తొలిసారిగా.. మాదకద్రవ్యాలు లభించాయి. కొకైన్, చరస్​తో పాటు మరో ఆరు రకాల మత్తు పదార్థాల అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను వరంగల్‌ టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు డ్రగ్స్​ సేవిస్తున్న మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

huge amount of drugs caught in warangal and 6 members arrested

చదువుకునే టైం నుంచే..

"పట్టుబడిన యువకులందరూ స్నేహితులే. చదువుకునే సమయం నుంచే మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారు. మూడేళ్లుగా వీళ్లంతా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారు. ఇందులో శివ్వా రోహన్ తరుచుగా.. గోవాకు వెళ్లేవాడు. అక్కడ జాక్, కాల్ జాఫర్​ అనే నైజీరియన్ల దగ్గరి నుంచి కొకైన్, చరస్​తో పాటు ఇతర మత్తు పదార్థాలను తీసుకొస్తాడు. అక్కడి నుంచి తీసుకొచ్చిన మత్తుపదార్థాలను రోహన్ తన స్నేహితులకు అమ్ముతాడు. వారితోనే కలిసి స్థానికంగా వున్న లాడ్జ్​లలో వాటిని సేవిస్తాడు. ఈ క్రమంలోనే మరో నిందితుడు పెంచికల కాశీరావుతో రోహన్​కు పరిచయం ఏర్పడింది. కాశీరావు కూడా హైదరాబాద్​లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే.. మధ్య మధ్యలో గోవాకు వెళ్లి నైజీరియాకు చెందిన మరో వ్యక్తి వద్ద మత్తు పదార్థాలను కొనుగోలు చేస్తాడు. రోహన్​తో పాటు ఇతర యువకులకు అమ్మేవాడు." - తరుణ్​జోషి, వరంగల్​ సీపీ

ఇంకొకరు పరారీలో..

హనుమకొండలోని నక్కలగుట్ట ప్రాంతంలో ఓ లాడ్జిపై దాడులు నిర్వహించి.. మత్తు పదార్థాలు సేవిస్తున్న ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అరెస్టు చేసిన నిందితుల్లో ఒకరు వరంగల్​కు చెందిన శివ్వారోహన్.. మరొకరు సైబరాబాద్​కు చెందిన పెంచికల కాశీరావుగా గుర్తించారు. మత్తు పదార్థాలను సేవిస్తున్న మరో నలుగురు యువకులను అరెస్ట్​ చేయగా.. ఇంకొకరు పరారీలో వున్నాడని పోలీసులు తెలిపారు.

యువకుల నుంచి 3 లక్షల 16 వేల రూపాయల విలువ గల ఒకటిన్నర గ్రాముల కొకైన్, 15 గ్రాముల చరస్, 15 ఎల్​ఎస్​డీ ఫ్లేవర్లు(LYSERGIC ACID DIETHYLAMIDE), 36 మత్తును కలిగించే ట్యాబ్లెట్లు(METHYLEN DIOXY METHAMPHETAMINE), గంజాయి నుంచి తీసిన నూనె, గంజాయి పొడిగా చేసే పరికరం, ఒక హుక్కా కుజాతో పాటు దానికి వినియోగించే సామగ్రితో పాటు ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details