తెలంగాణ

telangana

ETV Bharat / crime

Tobacco Seized: భారీగా నిషేధిత పొగాకు స్వాధీనం - Tobacco seized at usman ganj

భారీస్థాయిలో నిషేధిత పొగాకు (tobocco), జర్దాను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.58 లక్షల విలువ చేసే 1475 కిలోల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

huge amount of  banned tobocco
భారీగా నిషేధిత గుట్కా స్వాధీనం

By

Published : Nov 18, 2021, 9:22 PM IST

Updated : Nov 18, 2021, 10:38 PM IST

Tobacco Seized: భారీగా నిషేధిత పొగాకు స్వాధీనం.. కర్నూలు వాసి అరెస్ట్

పెద్ద ఎత్తున నిషేధిత పొగాకు, జర్దాను సరఫరా చేస్తున్న చిన్న నాగరాజు అనే అంతర్రాష్ట నిందితుడిని ఆరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ (cp anjani kumar) తెలిపారు. అతని వద్ద నుంచి రూ.58 లక్షల విలువ చేసే 1475 కిలోల పొగాకు ఉత్పత్తులను ( tobacco seized) స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. హైదరాబాద్, పెబ్బేరులోనూ ‘భారత్‌ ఏజెన్సీస్‌’ పేరుతో హోల్‌సేల్‌గా బీడీలు విక్రయిస్తున్నారని వివరించారు. చిన్న నాగరాజు నలభై ఏళ్లుగా భారత్‌ బీడీ విక్రయ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

కచ్చితమైన సమాచారంతో దాడులు..

నగరంలోని ఉస్మాన్‌గంజ్‌లోని ఓ గిడ్డంగిలో పొగాకు ఉత్పత్తులను (tobaccos seized) నిల్వ చేశాడనే కచ్చితమైన సమాచారంతో సోదాలు చేసినట్లు సీపీ వివరించారు. అఫ్జల్‌ గంజ్‌ పోలీసుల సహకారంతో ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించినట్లు సీపీ ( Hyderabad cp) వెల్లడించారు.

గోదాం నుంచి సరఫరా

నిందితుడు చిన్న నాగరాజుకు 2017లో దిల్లీలో అమిత్‌, నరేశ్ అనే ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడిందని సీపీ తెలిపారు. వారి వద్ద నుంచి టోబాకో ఉత్పత్తులు కొనుగోలు చేసి నగరంలోని ఉస్మాన్‌గంజ్‌లో ఉన్న గోదాంలో నిల్వ చేశాడని సీపీ పేర్కొన్నారు. ఈ గోదాం నుంచి హైదరాబాద్‌లో ఉన్న పాన్​​ షాపులకు విషపూరితమైన, నిషేధిత పొగాకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాడని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. నగరంలో ఎవరైనా నిషేధిత పొగాకు, జర్దా, గంజాయిని ఎవరైనా విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సీపీ అంజనీ కుమార్ (cp anjani kumar) కోరారు.

ఇప్పటి వరకు 1475 నిషేధిత పొగాకును (banned tobacco)సీజ్ చేయడం జరిగింది. దీని విలువ రూ.57 వేలకు పైగా ఉంది. ఉస్మాన్​ గంజ్​లోని ఓ గొడౌన్​లో నిల్వ చేశాడు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని బండిమెట్టకు చెందిన చిన్న నాగరాజును అదుపులోకి తీసుకున్నాం. పెబ్బేరు-వనపర్తిలో ఏరియాలో ఓ ఏజెన్సీలో పని చేశారు. అతనికి దిల్లీకి చెందిన వారితో పరిచయం ఉంది. ప్రజలు ఎవరికైనా ఇలాంటి సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ అపరేషన్​లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి అభినందనలు.

- అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ

కర్నూలు టూ హైదరాబాద్‌

"కర్నూలు జిల్లా బండిమెట్ట గ్రామానికి చెందిన చిన్ననాగరాజు పదోతరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి సూచన మేరకు పదిహేనేళ్ల క్రితం బీడీల విక్రయ ఏజెంట్‌గా మారాడు. కర్నూలులో చిల్లర దుకాణాలు, హోల్‌సేల్‌ వ్యాపారులకు బీడీలు విక్రయిస్తున్న చిన్న నాగరాజు 2011లో హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడ ఓ బీడీ పరిశ్రమలో ఉద్యోగిగా చేరాడు. బీడీల విక్రయాలను పెంచడంతో కంపెనీ అతడికి సొంతంగా ఏజెన్సీ నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు అనువుగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని 2017లో పెబ్బేరులో ఏజెన్సీని ప్రారంభించాడు. హైదరాబాద్‌తో పాటు కర్నూలు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లలో బీడీలను విక్రయించేవాడు."

దిల్లీ టూ హైదరాబాద్

బీడీల తయారీ, విక్రయాలు దిల్లీలో బాగుంటాయని తెలుసుకున్న చిన్న నాగరాజు నాలుగేళ్ల క్రితం దిల్లీకి వెళ్లాడు. చాందినీచౌక్‌లో నరేశ్ అనే వ్యక్తిని కలుసుకున్నాడు. బీడీలు అమ్మడం కంటే పొగాకు ఉత్పత్తులను నేరుగా విక్రయించడం.. తమలపాకుల్లో వేసే పొగాకును అమ్మితే రూ.లక్షల్లో లాభాలొస్తాయంటూ నరేశ్ చెప్పాడు. పొగాకు ఉత్పత్తులను రహస్యంగా హైదరాబాద్‌కు పంపుతానని.. వాటిని హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లలో విక్రయించుకోవచ్చని నరేశ్ చెప్పడంతో.. చిన్ననాగరాజు అంగీకరించాడు. అప్పటి నుంచి రత్నా టొబాకో, ఖిమామ్‌ స్పెషల్, జుహీ బ్లాక్‌స్టార్‌ పేర్లతో పొగాకు ఉత్పత్తులను నరేశ్​ దిల్లీ నుంచి హైదరాబాద్‌కు పంపుతుండగా చిన్న నాగరాజు వాటిని ఉస్మాన్‌ గంజ్‌లోని ఓ గోదాంలో నిల్వచేసి హోల్‌సేల్, రిటైల్‌గా అమ్మేవాడు. తెలంగాణలో పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం విధించడంతో హైదరాబాద్‌లో దొంగచాటుగా విక్రయించి.. ఎక్కువ మొత్తాన్ని ఏపీకి పంపుతున్నాడని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపారు. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై 9490616555 నంబర్‌కు సమాచారం ఇస్తే తాము చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇవీ చూడండి:

Constable Liquor Smuggling: పోలీసు వాహనంలో గుట్టుగా మద్యం రవాణా... కానిస్టేబుల్ అరెస్ట్​

Ganja in Telangana: గంజాయి, మత్తుపదార్థాల రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

Last Updated : Nov 18, 2021, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details