భారీస్థాయిలో నిషేధిత పత్తి విత్తనాలు తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.17 లక్షల విలువగల 850 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలను పరిశీలించిన రామగుండం కమిషనర్, జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ సత్యనారాయణ కేసు వివరాలను వెల్లడించారు.
జిల్లాలోని దహేగం మండలంలో పీపీ రావుకాలనీలో నిన్న తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారులో 45 పాకెట్ల పత్తి విత్తనాలు దొరికాయని తెలిపారు. వాహనంలోని పిట్టల శ్రీనివాస్, బండి శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి స్వస్థలమైన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామంలో 750 కిలోల నిల్వలు ఉన్నాయని పోలీసులకు తెలిపారు. మరో 100 కిలోల వరకు స్థానిక రైతులకు విక్రయించినట్లు నిందితులు అంగీకరించారు