తెలంగాణ

telangana

ETV Bharat / crime

Bank theft: మంకీ క్యాప్స్.. గ్యాస్ కట్టర్స్.. జులాయి సీన్ రిపీట్..!

Bank theft: నిజామాబాద్​ జిల్లాలో భారీ చోరీ జరిగింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకును కొందరు దుండగులు కొల్లగొట్టారు. సినీఫక్కీలో పెద్దఎత్తున నగదు, బంగారం ఎత్తుకెళ్లారు.

Bank theft
గ్రామీణ బ్యాంకులో చోరీ

By

Published : Jul 4, 2022, 3:59 PM IST

Updated : Jul 4, 2022, 9:23 PM IST

Bank theft: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌లో భారీ చోరీ జరిగింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నగదు, బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. బ్యాంక్ లాకర్లలోని రూ.7.28 లక్షలు, రూ.4.46 కోట్ల విలువైన 8.250 కిలోల బంగారు నగలు అపహరించారు. నిన్న ఆదివారం కావడంతో నేడు విషయం బయటకొచ్చింది. శనివారం రాత్రి చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జులాయి సినిమాలో ఘటనను తలపించింది.

గ్యాస్ కట్టర్ల సాయంతో లాకర్లు తెరిచి..:బ్యాంక్ షట్టర్ తెరిచి లోపలికి ప్రవేశించిన దొంగలు సీసీటీవీ కెమెరాల వైర్లను ధ్వంసం చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్లతో లాకర్లను తెరిచి బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రత్యేక క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. మంకీని పోలిన మాస్కులు ధరించిన దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఘటనాస్థలాన్ని సీపీ నాగరాజు పరిశీలించారు. దొంగల కోసం 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.

Last Updated : Jul 4, 2022, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details