కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన పొనుగంటి మాణిక్యం ఇంట్లో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
మంటల్లో ఇళ్లు దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం - karimnagar crimes
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అగ్ని ప్రమాదం జరిగింది. కోరపల్లిలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
house fire accident
అగ్నిమాపక సిబ్బంది సకాలంలో గ్రామానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. భారీగా చెలరేగిన మంటలకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది.
ఇదీ చదవండి:అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు