తెలంగాణ

telangana

ETV Bharat / crime

బొడ్డుతాడు కోయబోయి బిడ్డ వేలు కోసేసిన వైద్యులు.. చివరికి ఏం జరిగిందంటే? - వైద్యుల నిర్లక్ష్యం

New Born Baby Finger cuting: పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ బాబుకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం పుట్టిన పసికందు మహిళ ఇద్దరు సురక్షితంగానే ఉన్న.. ఆసుపత్రిలో సిబ్బంది చేసిన పనికి ఆ మహిళ కుటుంబ సభ్యులు అయోమాయానికి గురయ్యారు.

MACAHRLA
MACAHRLA

By

Published : Oct 4, 2022, 4:52 PM IST

New Born Baby Finger cuting: బొడ్డు కోయబోయి బిడ్డ వేలు కోసిన ఘటన పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వరూప అనే మహిళ గత నెల 30న ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. అమె స్పృహలోకి రాక ముందే పట్టిన బాబుకు బొడ్డు తాడు కోసే క్రమంలో సిబ్బంది పసికందు కుడి చేతి చిటికెన వేలు కోసేశారు.

వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా శస్త్ర చికిత్స చేసి వేలు అతికిస్తామని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే కారకురాలైన పారిశుద్ధ్య కార్మికురాలిని విధులు నుంచి తొలగించామని వైద్య విధాన పరిషత్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బీవీ రంగారావు ఆదేశించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details