ఆదిలాబాద్ పట్టణంలో అనుమతి లేకుండా కొవిడ్ టెస్టులు చేస్తున్న హర్ష స్కిన్ జనరల్ ప్రైవేటు ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. ల్యాబ్లో పరీక్షలు చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. కరోనా పరీక్ష కిట్లు లభ్యం కావడంతో నిర్వహకుల తీరుపై మండి పడ్డారు.
అనుమతులు లేకుండా కొవిడ్ పరీక్షలు చేస్తున్న ఆస్పత్రి సీజ్ - తెలంగాణ వార్తలు
ఆదిలాబాద్లో అనుమతులు లేకుండా కరోనా పరీక్షలు చేస్తున్న ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. ఆస్పత్రిలో లభ్యమైన కిట్లను స్వాధీనం చేసుకొని నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఆస్పత్రి సీజ్, ఆదిలాబాద్లో అనుమతులు లేకుండా కొవిడ్ పరీక్షలు
కిట్లను స్వాధీనం చేసుకుని... నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు ఉచితంగా చేస్తున్నారని... అందరూ అక్కడే చేయించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:‘అమెరికన్ డాలర్ల’ పేరిట మాయ.. రూ.16 లక్షలు స్వాహా