తెలంగాణ

telangana

ETV Bharat / crime

గర్భవతి అని చెప్పారు.. ప్రసవం కోసం వెళ్తే అసలు విషయం తెలిసింది - ప్రసూతి నిర్ధరణ పరీక్షల్లో వైద్యుల నిర్లక్ష్యం

ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్వాకం మరోసారి బట్టబయలైంది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మహిళ.. గర్భవతి కాకున్నా పరీక్షలు నిర్వహించి గర్భవతి అని తేల్చేశారు వైద్యులు. నెలలు నిండాయని భావించిన ఆ మహిళ.. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళింది. అసలు విషయం తెలుసుకుని షాక్​కు గురైంది.

medical negligence
వైద్యుల నిర్లక్ష్యం

By

Published : Jun 21, 2021, 8:31 PM IST

వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ పాలిట శాపంగా మారింది. గర్భవతి కాకున్నా...గర్భవతి అని చెప్పి వైద్యం చేశారు. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన ఓ మహిళకు అక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి గర్భవతి అని తేల్చారు. దీంతో ఆమె ప్రసవం కోసం పుట్టినిల్లు అయిన విజయవాడకు వెళ్లారు. అనంతరం వైద్యం కోసం విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా.. అక్కడ ఎలాంటి పరీక్షలు చేయకుండా కొన్ని నెలలుగా మాత్రలు ఇచ్చి పంపించారు. గర్భవతి అని చెప్పి పది నెలలైనా.. నొప్పులు రాకపోవటంతోవ ఆందోళనకు గురైన ఆ మహిళ స్థానిక ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించింది.

పరీక్షల్లో మహిళ గర్భవతి కాదని.. ఆమె కడుపులో కణితి ఉందని వైద్యులు తేల్చి చెప్పారు. పాత ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తీరుపై కూడా బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి పది నెలలు ఆసుపత్రి చుట్టూ తిప్పుకున్నారని మండిపడ్డారు. ఆయా వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:SUICIDE: ఉదయం మూడు ముళ్లేసి.. రాత్రికి ఉరేసుకున్నాడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details