Honor Killing in Sangareddy : ‘ప్రేమ పేరుతో పరువు తీస్తోంది...ఇతర సామాజిక వర్గానికి చెందినవాడితో తగదని వారించినా మార్పులేదని’ భావించిన కసాయి తల్లి కన్న కూతురునే ప్రియుడితో కలిసి హత్యచేసింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెలిల్లో సోమవారం సంచలనం రేకిత్తించిన దళిత మైనర్ బాలిక హత్య ఘటనలో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఈ సందర్భంగా గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఘటన వివరాలను డీఎస్పీ శంకర్ రాజు, సీఐ రాజశేఖర్ వెల్లడించారు.
Honor Killing in Sangareddy: ప్రేమ పేరుతో పరువు తీస్తోందని.. ప్రియుడితో కలిసి బిడ్డను చంపేసిన తల్లి - తెలంగాణ వార్తలు
Honor Killing in Sangareddy: నవమాసాలు మోసి... కని పెంచిన ఆ తల్లే కూతురి పాలిట యమపాశంలాగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకుంటూ... కంటిపాపలా కాపాడుకోవాల్సిన ఆమే... బిడ్డ ఉసురు తీసింది. మమతకు మారుపేరైన కన్నతల్లి.. వేరే సామాజిక వర్గం యువకుడిని ప్రేమించిందన్న కారణంతో తన గారాలపట్టీని మట్టుబెట్టింది. తన ప్రియుడితో కలిసి కుమార్తెను హతమార్చి... ఆపై వేరే వ్యక్తిపై నేరం మోపేందుకు యత్నించింది. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికింది.
ప్రేమ పేరుతో పరువు తీస్తోందని.. ప్రియుడితో కలిసి బిడ్డను చంపేసిన తల్లి
Last Updated : Feb 17, 2022, 2:21 PM IST