ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనిలో మహిళా హోంగార్డు శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ఆమెను.. చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో పనిచేసిన రామకృష్ణమ్మ.. ఒకటో తేదీన ఆదోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. అక్కడ సీఐ తనను తీవ్రంగా అవమానించారని, విధుల్లో చేర్చుకోవడం లేదని వాపోయారు.
సీఐ అవమానించారని.. మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం - adoni latest news
ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనిలో మహిళా హోంగార్డు ఆత్మహత్యకు యత్నించారు. ఒకటో తేదీన ఆదోనిలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు బదిలీపై రాగా.. సీఐ అవమానించారని, విధుల్లో చేర్చుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం