హైదరాబాద్ సరూర్‌నగర్ చెరువు(SAROORNAGAR POND)లో దూకి ఆత్మహత్యకు(SUICIDE ATTEMPT) యత్నించిన మహిళను హోంగార్డు(HOMEGUARD) రక్షించారు. చార్మినార్ పాతబస్తీకి చెందిన కనకమణి(30) కుటుంబ సమస్యల కారణంగా చెరువులో దూకింది. అక్కడే ఔట్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్నహోంగార్డు ఈశ్వరయ్య(HOMEGUARD ESHWARAIAH) విషయం గుర్తించారు. వెంటనే చెరువులోకి దూకి కనకమణిని కాపాడారు.
కనకమణికి కౌన్సిలింగ్...
అనంతరం ఆమెను కూర్చోపెట్టి చాలా సేపు మాట్లాడారు. నీవు చనిపోతే... నీ భర్త పిల్లలు దిక్కులేనివారవుతారని(COUNCELLING) చెప్పారు. చిన్న చిన్న సమస్యలకు చావు సమాధానం కాదని... క్షణికావేశంలో ఆత్మహత్య(SUICIDE) చేసుకుంటే మన జీవితాలే నాశనమవుతాయని వివరించారు. ఆమె జీవితంలో ఆత్మహత్య చేసుకోనని మాటిచ్చాకే ఆమెని ఇంటికి పంపించారు. హోంగార్డు ఈశ్వరయ్య గతంలోనూ అనేక మంది ప్రాణాలు కాపాడారు. అందుకు గాను ఆయనకు రాచకొండ కమిషనర్(RACHAKONDA CP) రివార్డులను, అవార్డులను అందించారు.
చెరువులో దూకిన గృహిణి.. కాపాడిన హోం గార్డు.. ఇదీ చూడండి:Tragedy: ముగ్గురు కుమార్తెలకు ఉరేసి తల్లి బలవన్మరణం