ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన హోంగార్డుపై సికింద్రాబాద్ తుకారాంగేట్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అడ్డగుట్టలో నివాసముండే హోంగార్డు బి. మల్లికార్జున(40).. హైదరాబాద్ సీసీఎస్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు పరిచయమైన బాలిక(16)ను కొద్ది రోజుల కిందట అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరికి చెప్పొద్దని ఆమెను భయపెట్టాడు.
బాలికపై హోంగార్డు అత్యాచారం - హైదరాబాద్ తాజా వార్తలు
ప్రజలకు రక్షణగా నివాల్సినే పోలీసే రాక్షసుడిగా మారాడు. బాలికపై ఓ హోం గార్డు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టలో జరిగింది.
బాలికపై హోంగార్డు అత్యాచారం
బాలికకు రెండు రోజుల కిందట ఆరోగ్యం సరిగా లేకపోవటంతో తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. ఈనెల 18న వారు ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హోంగార్డును ఈనెల 19న అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడని గోపాలపురం ఏసీపీ వెంకటరమణ తెలిపారు. అదే రోజు రాత్రి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదంలో డెంటల్ విద్యార్థిని మృతి