భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో హోలీ పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు చోట్ల గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఘటనలో... ఓ యువకుడి మరణించగా ..మరొకరు గల్లంతయ్యారు. అతని గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చింత్రియాల గూడెంకు చెందిన జంపయ్య(19) గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టగా జంపయ్య మృతదేహం లభ్యమైంది.
గోదావరిలో మునిగి ఒకరు మృతి, ఒకరు గల్లంతు - bhadradri district crime news
హోలీ పండుగరోజున విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో ఈతకు వెళ్లిన యువకుల్లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందగా.. మరో వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఆ యువకుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.
మరో ఘటనలో బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంకు చెందిన రాగ గోపి(21) నెల్లిపాక వద్ద గోదావరి నదిలో కనిపించకుండాపోయాడు. గోపి తన స్నేహితుడు కార్తిక్‌తో కలిసి నదిలో స్నానానికి దిగాడు. ఇద్దరు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండగా అక్కడే ఉన్న పలువురు స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించి కార్తీక్‌ని బయటికి తీశారు. కానీ దురదృష్టవశాత్తూ గోపి నీటిలో తప్పిపోయాడు. సమాచారం తెలుసుకున్న అశ్వాపురం ఎస్సై రాజేష్ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి:ప్రేమ వివాహం.. మూడు రోజులకే వరుడు దుర్మరణం