సికింద్రాబాద్ పరిధిలోని నేరెడ్‌మెట్‌లోని ఓ పెళ్లిలో హిజ్రాలు హల్‌చల్ చేశారు. పెళ్లి వారింటికి వెళ్లి రూ. 50వేలు డిమాండ్ చేశారు. వారు డబ్బులు ఇవ్వకపోవడంతో దుస్తులు విప్పి హంగామా చేశారు. అంతటితో ఆగకుండా శుభకార్యానికి వచ్చిన బంధువులపై దాడికి పాల్పడ్డారు. బాధితులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న నేరెడ్‌మెట్ పోలీసులు హిజ్రాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
HIJRAS HULCHAL: నేరెడ్‌మెట్ పీఎస్‌లో హిజ్రాల హల్‌చల్ - telangana varthalu
నేరెడ్‌మెట్‌లో హిజ్రాలు హల్‌చల్ చేశారు. పెళ్లి వారి ఇంటికి వెళ్లి 50 వేలు డిమాండ్ చేయగా... వారు డబ్బులు ఇవ్వకపోవడంతో బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తించిన హిజ్రాలు... పెళ్లి వారిపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు పీఎస్‌కు తరలించగా.. అక్కడ కూడా హంగామా చేశారు.
హిజ్రాల హల్‌చల్
అక్కడ కూడా దుస్తులు విప్పి పోలీసులపై వారి ప్రతాపం చూపించారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు హిజ్రాలపై 506, 448 సెక్షన్లు, 188, 51(b) విపత్తు నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: రోడ్డు నాణ్యత ఎంతో మొక్కను అడుగు..!
Last Updated : Jun 17, 2021, 10:56 PM IST