Jubileehills Gang Rape Case : నిందితుల డీఎన్ఏ సేకరణకు కోర్టు అనుమతి - జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు న్యూస్

10:14 June 27
జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసు నిందితుల డీఎన్ఏ సేకరణకు కోర్టు అనుమతి
Jubileehills Gang Rape Case :హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల డీఎన్ఏ సేకరించడానికి పోలీసులు కోర్టును అనుమతి కోరగా న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిందితుల నుంచి పోలీసులు డీఎన్ఏ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు. ఇప్పటికే.. అత్యాచారం జరిగిన ఇన్నోవా కారులో ఆధారాలు సేకరించారు. డీఎన్ఏ సేకరించిన తర్వాత వాహనంలోని ఆధారాలతో పోల్చనున్నారు.
నిందితులు ఇన్నోవా వాహనంలోనే ఉన్నట్లు శాస్త్రీయంగా నిరూపించడానికి డీఎన్ఏ టెస్ట్ ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. అవసరమైతే బాధితురాలి డీఎన్ఏను సేకరించే యోచనలో ఉన్నారు. మే 28న మైనర్ బాలికను సాదుద్దీన్ సహా మరో ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు.
ఈ కేసులో ఐదుగురు మైనర్లతో పాటు ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అందర్ని కొన్ని రోజుల పాటు రిమాండ్‌లో ఉంచి విచారించారు. ప్రస్తుతం సాదుద్దీన్ చంచల్‌గూడ జైల్లో ఉండగా.. ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.