ఛత్తీస్‌గఢ్ భారీ ఎన్‌కౌంటర్‌తో.. రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భద్రతా బలగాలు విస్తృత తనిఖీలు చేపడుతున్నాయి. ప్రధానంగా గోదావరి దాటి.... ఈ జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలుండటంతో.. సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
గత 4 నెలల నుంచి.. ఈ ప్రాంతంలో మావోయిస్టుల యాక్షన్ టీం సంచారం కదలికలతో... నిఘా పటిష్టం చేయగా.. తాజాగా జరిగిన ఎన్కౌంటర్ని పురస్కరించుకుని.. బలగాలు మరింతగా అప్రమత్తమయ్యాయి. కన్నాయ్ గూడెం, ఏటూరునాగారం, వాజేడు.. వెంకటాపురం, మంగపేట అడవుల్లో ముమ్మరంగా కూంబింగ్ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్ కు ఆనుకుని ఉన్న వాజేడు, వెంకటాపురం మండలాల పరిధిలోని.. అటవీ ప్రాంతంలో ప్రత్యేక బలగాలతో మరింత ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.