తెలంగాణ

telangana

ETV Bharat / crime

సిటీలో హైటెక్​ వ్యభిచారం.. నగ్నంగా వీడియో కాల్స్​తో వలపు బాణం

నగరంలో హై‘టెక్‌’ వ్యభిచారం నడుస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నిర్వాహకులు పోలీసులకు చిక్కకుండా దందా నడిపిస్తున్నారు. ‘యాప్‌’ల ద్వారా వలపు వల విసురుతూ చీకటి దందా కొనసాగిస్తున్నారు. విదేశాల నుంచి మహిళలను తీసుకొచ్చి ‘డిమాండ్‌’ను సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా నేరేడ్‌మెట్‌లో వ్యభిచారం చేస్తూ టాంజానియాకు చెందిన ఓ మహిళ, ఆమెకు సహకరిస్తున్న స్నేహితుడు రాచకొండ పోలీసులకు చిక్కడం గమనార్హం.

Hi-tech prostitution in the city with nude video calls
Hi-tech prostitution in the city with nude video calls

By

Published : Jul 2, 2021, 9:35 AM IST

గూగుల్‌ ప్లేస్టోర్‌లో సుమారు 200కు పైగా డేటింగ్‌ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవే ఇప్పుడు నిర్వాహకులకు వరంగా మారాయి. వీటిలో కొన్ని ఉచితం. మరికొన్నింటికి రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్టర్‌ అయిన తర్వాత అసభ్యకరమైన ఫొటోలను నాలుగైదు యాప్‌ల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఆసక్తి చూపించిన వారితో కొన్ని రోజులు ఛాటింగ్‌ చేస్తున్నారు. ఆ తర్వాత మహిళలు తమ వాట్సాప్‌ నంబర్‌ను ఇస్తున్నారు. దీంతో యాప్‌ నుంచి ఛాటింగ్‌ వాట్సాప్‌కు మారుతుంది. అవతలి వైపు వ్యక్తులు అడుగు ముందుకేసేలా వాట్సాప్‌లో నగ్నంగా ఫొటోలు పంపిస్తున్నారు. వీడియో కాల్స్‌ చేస్తున్నారు. అటువైపు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే ఫలానా సమయంలో.. ఫలానా దగ్గరికి రావాలంటూ లొకేషన్‌ షేర్‌ చేస్తున్నట్లు గుర్తించామని పోలీసులు పేర్కొంటున్నారు.

పర్యాటక వీసాపై విదేశాల నుంచి...

ఒకప్పుడు ఉద్యోగాల పేరిట ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయించే ముఠాలు ఇప్పుడు రూట్‌ మార్చాయి. కొందరేమో స్టడీ, పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చిన ఉగాండా, నైజీరియా, టాంజానియా తదితర దేశాలకు చెందిన మహిళలను గుర్తించి.. డబ్బులు ఆశ చూపి ఈ రొంపిలోకి దింపుతున్నారు. మరికొందరేమో రష్యా, ఉజ్బెకిస్థాన్‌ నుంచి ప్రత్యేకంగా పర్యాటక వీసాపై రప్పిస్తున్నారు. సుమారు నెల కిందట చైతన్యపురిలో ఉగాండాకు చెందిన మహిళలు వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కారు. అంతకు ముందు మాదాపూర్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన మహిళలు పట్టుపడ్డారు. ఇలా ఈ రొంపిలోకి దిగిన విదేశీ మహిళల్లో కొందరు నిర్వాహకులతో విబేధించి సొంతంగా దందా చేస్తున్నారు. నేరేడ్‌మెట్‌, చైతన్యపురిలో పట్టుపడిన టాంజానియా, ఉగాండా దేశస్థులు ఈ జాబితాలోకే వస్తారని పోలీసులు వివరిస్తున్నారు.

లాక్‌డౌన్‌లో హోటళ్లు మూత పడటంతో...

వలపు వల విసరడం మొదలు డబ్బుల చెల్లింపు అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం ద్వారా ముందే డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారు. రూ.5వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లాక్‌డౌన్‌లో హోటళ్లు మూతపడ్డాయి. పోలీసుల నిఘా పెరగడంతో నిర్వాహకులు రూట్‌ మార్చారు. పోలీసులు దృష్టి సారించని ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఈ తరహాలోనే నేరేడ్‌మెట్‌లో పోలీసులకు పట్టుపడిన టాంజానియా దేశస్థులు దంపతులమని చెప్పి ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడికే విటులను రప్పించి అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు.


ఇదీ చూడండి: JALA VIVADAM: జలజగడం.. జూరాల నుంచి పులిచింతల వరకు ప్రాజెక్టులపై పహారా

ABOUT THE AUTHOR

...view details