బెంగళూరు డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని హీరో తనీష్ స్పష్టం చేశారు. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్ర నిర్మాత శంకర్ గౌడ విషయంలో తనకూ నోటీసులు అందినట్లు పేర్కొన్నారు. ఆ నోటీసులు కేవలం విషయ సేకరణకు మాత్రమే ఇచ్చారని, ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. గతంలో డ్రగ్స్ కేసులో తన కుటుంబం ఎంతో ఇబ్బందిపడిందని, మళ్లీ ఇప్పుడు అవాస్తవాలు ప్రసారం చేస్తూ మానసికవేదనకు గురిచేస్తున్నారని తనీష్ వాపోయారు. వారిపై న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు.
బెంగళూరు డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు: తనీష్ - telangana crime news
బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నిర్మాత శంకర్‌గౌడ విషయంలో తనకూ నోటీసులు అందాయని యువ కథానాయకుడు తనీష్ వెల్లడించారు. నోటీసులు కేవలం విషయ సేకరణకు మాత్రమే ఇచ్చారని తెలిపారు. డ్రగ్స్ కేసులో అవాస్తవాలు ప్రసారం చేస్తూ తన కుటుంబానికి మానసికవేదనకు గురిచేస్తున్నారని తనీష్ వాపోయారు.

బెంగళూరు డ్రగ్స్ కేసులో తనీష్
డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాతను రెండేళ్ల కిందట ఓ సినిమా విషయంలో కలిశానని, అప్పటి నుంచి మళ్లీ ఆ నిర్మాతను ఎప్పుడూ కలవలేదని తనీష్ అన్నారు. రెండేళ్లుగా బెంగళూరు వైపే చూడలేదని, పోలీసులు ఇచ్చిన నోటీసులకు తప్పకుండా సమాధానం చెబుతానని తెలిపారు.
బెంగళూరు డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు: తనీష్