రంగారెడ్డి జిల్లా మంచిరేవుల(manchirevula case) ఫామ్‌హౌజ్ కేసులో(Gambling Case in Hyderabad) హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఫాంహౌజ్ లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించారని కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
manchirevula case: పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్ - manchirevula case
![manchirevula case: పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్ Hero Nagashourya's father arrested in poker case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13593719-902-13593719-1636536026147.jpg)
14:41 November 10
manchirevula case: పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్
అనంతరం ఉప్పర్‌పల్లి కోర్టులో శివలింగప్రసాద్‌ను పోలీసులు హాజరుపర్చారు. మంచిరేవుల పేకాట కేసులో గుత్తా సుమన్‌తో కలిసి పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటికే శివలింగప్రసాద్ పిటిషన్ దాఖలు చేయగా.. బెయిల్ మంజూరైంది.
మంచిరేవుల వద్ద ఫామ్‌హౌజ్‌లో పేకాట కేసులో పోలీసుల దర్యాప్తు(Gambling Case in Hyderabad) ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో పలువురు ప్రముఖులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మహబూబాబాద్ మాజీ ఎమ్యెల్యే శ్రీరామ్ భద్రయ్య ఇప్పటికే అరెస్టయినట్లు వెల్లడించారు. పేకాట నిర్వాహకుడు గుత్తా సుమన్.. మరో 29 మందిని ఫామ్‌హౌస్‌కు పిలిచి పేకాట నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఫాంహౌస్‌పై ఆదివారం రాత్రి నిర్వహించిన దాడుల్లో రూ.6,77,250, 31 సెల్ఫోన్లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నామని ... 4 టేబుళ్లలో నగదు పెట్టి పేకాట(Gambling Case in Hyderabad) ఆడుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. 30 మందిపై టీఎస్ గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని... సీఆర్‌పీసీ 154, 157 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. నార్సింగి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి... 30 మంది నిందితులను ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు.
ఇదీ చూడండి:
Gambling Case: యంగ్ హీరో ఫాంహౌస్‌లో పేకాట.. మాజీ ఎమ్మెల్యే సహా 30 మంది అరెస్ట్