విశాఖ పోలీసులు భారీ గంజాయి దందాకు చెక్ పెట్టారు. రెండు వాహనాల్లో వేర్వేరు రూట్లలో ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 2,690 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏజెన్సీ కొయ్యూరు మండలం చీడిపాలెం, బూదరాళ్ల జంక్షన్ల వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. చీడిపాలెం జంక్షన్ వద్ద ఐషర్ వాహనంలో తరలిస్తున్న 1,710 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని వ్యాన్ డ్రైవర్ రామకృష్ణను అరెస్ట్ చేశారు. బూదరాళ్ల జంక్షన్ వద్ద బొలెరో వాహనంలో తరలిస్తున్న 980 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని డ్రైవర్‌ను పట్టుకున్నారు.
marijuana seized: రూ.2.5 కోట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్ - విశాఖలో గంజాయి స్వాధీనం
విశాఖ ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి రవాణా చేస్తున్న 2,690 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.2.5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి, మూడు వాహనాలను సీజ్ చేశారు.
marijuana seized: రూ.2.5 కోట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
వ్యాన్ ముందు ద్విచక్ర వాహనంపై పైలట్‌గా వస్తున్న ఓ వ్యక్తి వాహనాన్ని వదిలి పరారైనట్లు ఎస్సై నాగేంద్ర చెప్పారు. బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అతని ఆచూకీ తెలుసుకుంటామన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.15,200 నగదు, మూడు వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 2.5 కోట్లకుపైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి:Tollywood Drugs case: 12 మందికి ఈడీ నోటీసులు.. రేపు విచారణకు పూరీ జగన్నాథ్!