మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్లు క్రాస్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని, పటికను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానస్పదంగా కనిపించిన డీసీఎంను పరిశీలించగా బెల్లం అక్రమ రవాణా బయట పడింది. 75 క్వింటాళ్ల నల్లబెల్లం, 2 క్వింటాళ్ల పటికతోపాటుగా డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 7.5 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
భారీగా నల్లబెల్లం పట్టివేత.. ముగ్గురి అరెస్ట్ - mahabubabad district latest news
అక్రమంగా తరలిస్తున్న 75 క్వింటాళ్ల నల్లబెల్లం, 2 క్వింటాళ్ల పటికను మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్లు క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు.
భారీగా నల్లబెల్లం పట్టివేత... ముగ్గురి అరెస్ట్
మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామ శివారులోని భజన తండాకు చెందిన వాంకుడొత్ వీరేందర్, యాకన్నలు అనంతపురం జిల్లాకు చెందిన డ్రైవర్ తిరుపతి సహకారంతో గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమ రవాణా చేస్తూ... గుడుంబా సరఫరా దారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిందని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని అన్నారు. డీసీఎంను పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులను అందించారు.
ఇదీ చదవండి:మియాపూర్లో వరుస చోరీలు.. ఇద్దరు అరెస్ట్