తెలంగాణ

telangana

ETV Bharat / crime

హెడ్​మాస్టర్ పాడుబుద్ధి.. దేహశుద్ధి చేసిన బాలిక తల్లిదండ్రులు - తాజా ఏపీ వార్తలు

HEADMASTER MISBEHAVIOR WITH GIRL STUDENT: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాల్సిన ఉపాధ్యాయులే వారిపై కన్నేస్తున్నారు. తాజాగా ఏపీలోని గుంటూరులో మూడో తరగతి చదువుతున్న బాలికపై హెడ్​మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది.

HEADMASTER
బాలిక అసభ్యంగా ప్రవర్తించిన హెడ్​ మాస్టర్​

By

Published : Dec 2, 2022, 3:48 PM IST

HEADMASTER MISBEHAVIOR WITH STUDENT : ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాల పట్టాభిపురంలో మూడో తరగతి చదువుతున్న బాలికపై హెడ్ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. పట్టాభిపురం ప్రాథమిక ఉర్దూ పాఠశాల హెడ్ మాస్టర్ షాజహాన్.. బాలికపై వేధింపులకు పాల్పడ్డారంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆయనపై దాడి చేశారు. దీంతో అతను పాఠశాల నుంచి పారిపోయాడు. వెంటనే వాళ్లు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాజహాన్​పై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details