రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం గొల్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కరోనా బారినపడిన ఓ ప్రధానోపాధ్యాయుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కరోనా సోకిందనే మనస్తాపంతో ప్రధానోపాధ్యాయుడి బలవన్మరణం - గొల్లపల్లిలో ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్య వార్తలు
కరోనా సోకిన ఓ ప్రధానోపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలొదిలాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా గొల్లపల్లిలో చోటుచేసుకుంది.
ప్రధానోపాధ్యాయుడి బలవన్మరణం
గొల్లపల్లి గ్రామానికి చెందిన నర్సింలు అనే వ్యక్తి కమ్మెట ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. భార్య విడాకులు ఇవ్వడంతో ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మనస్తాపం చెందిన నర్సింలు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన తమ్ముడు, అన్నయ్య, వారి పిల్లలను జాగ్రత్తగా ఉండాలంటూ ఉత్తరం రాసి ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బోరున విలపించారు.